ముమ్మిడివరం ఏరియాలో కోళ్లకు కత్తులు కట్టాలంటే ఆ తండ్రీ కొడుకులే!

  • నిన్న జగన్ పై శ్రీనివాసరావు దాడి
  • సంక్రాంతి వస్తే తండ్రీ కొడుకులు బిజీ
  • పందాలతో చెడిపోతున్నాడనే విశాఖకు పంపిన తండ్రి
గురువారం నాడు వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడి పందాలు జరిగే సమయంలో కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు వైకాపా అధినేత వైఎస్ జగన్ పై దాడి చేసిన తరువాత, శ్రీనివాసరావు గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో కోళ్లకు కత్తులు కట్టడంలో శ్రీనివాసరావు, అతని తండ్రి సిద్ధహస్తులని తెలుస్తోంది.

కోడిపందాలకు పెట్టింది పేరైన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి వేళ, వీరిద్దరూ చాలా బిజీగా గడుపుతారని ఇరుగుపొరుగు వాసులు చెబుతున్నారు. గడచిన సంక్రాంతి సమయంలోనూ పలువురు నేతలు ఏర్పాటు చేసిన బరుల వద్ద వీళ్లు కోళ్లకు కత్తులు కట్టే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు. గడచిన సంక్రాంతి తరువాత, కోడిపందాలతో తమ కొడుకు చెడిపోతున్నాడన్న ఉద్దేశంతోనే విశాఖకు పంపించామని, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని సూచించామని శ్రీనివాసరావు తండ్రి మీడియా ముందు వ్యాఖ్యానించాడు. 
Go Back to Shorts
Vizag
Airport
Jagan
Srinivasarao

More Telugu News